ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 8:54 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి,

హైదరాబాద్,జూలై 21,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఆదేశించారు..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్ లను ఆన్ లైన్ లో సమర్పించిట్లయితే హార్డ్ కాపీ కోసం బిఎల్ఒలు ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.

ఎన్యుమరేసన్ ఫారమ్ సమర్పించేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పొద్దని, ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్ లను సమర్పించేందుకు అవసరమైన సహాయాన్ని అందించి, వారి ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు.

అలాగే ఓటరు జాబితాల్లో వీవీఐపి, వీఐపి ఓటర్ల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు.

గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రాజకీయపార్టీలతో నిర్వహించే సమావేశాల్లో పారదర్శకత పాటిస్తూ, సంబంధిత వివరాలను నమోదు చేయాలని, పట్టణ ప్రాంతాలు, పురోగతి తక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ వారంలోగా ప్రతి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియ 90శాతం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు.

అలాగే నోమ్యాపింగ్ కేటగిరీలో ఉన్న ఓటర్లను పూర్తిస్థాయిలో ధృవీకరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత ఎన్నికల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్. వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఎఎస్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి జి.ఎస్. చారిలు, తదితరుల పాల్గొన్నారు.
================================